Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో శాఖల వారీ కేటాయింపులు.. ముఖ్యాంశాలివీ..
తెలంగాణ బడ్జెట్(Telangana Budget)ను శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish rao) ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు.
హైదరాబాద్: ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget)ను మంత్రి ప్రవేశపెట్టారు. రూ.2,90,396కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,885 కోట్లు కేటాయించారు. కీలకమైన దళితబంధు పథకానికి రూ.17,700కోట్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ.12వేల కోట్ల కేటాయింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని మంత్రి హరీశ్ చెప్పారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ బడ్జెట్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కేటాయింపులిలా..
> నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు
> వ్యవసాయ రంగం రూ.26,831
> విద్యుత్ రంగం రూ.12,727 కోట్లు
> ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
> ఆసరా పింఛన్లకు రూ.12,000 కోట్లు
> దళితబంధుకు రూ.17,700 కోట్లు
> గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధికి రూ.15,233 కోట్లు
> బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
> కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.3,210 కోట్లు
> మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
> మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
> హరితహారానికి రూ.1,471 కోట్లు
> విద్యారంగానికి రూ.19,093 కోట్లు
> వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు
> పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
> పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు
> రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు
> పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
> హోం శాఖకు రూ.9,599 కోట్లు
> కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు
> కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!