Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబురాలకు సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది.

Published : 01 Jun 2024 22:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సంబరాలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 9.15 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళి అర్పించనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

అనంతరం సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర అధికార గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరించి.. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులు ప్రదానం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని