Kakinada: ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపునకు యత్నం.. కాకినాడలో ఉద్రిక్తత

కాకినాడలోని సంతచెరువు సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 29 Dec 2023 17:31 IST

సంతచెరువు: కాకినాడలోని సంతచెరువు సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించేందుకు యత్నించగా.. తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నాయి. వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ అనుచరులే ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇరు పార్టీల నాయకుల్ని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి మాట్లాడారు. తామంతా అమ్మవారి భక్తులమేనని.. గుడికి ఎలాంటి అడ్డంకి లేకపోయినా ఇలా ఎన్టీఆర్‌ విగ్రహం తొలగించేందుకు కుట్ర పన్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో చేసిన కౌన్సిల్ తీర్మానం మేరకే ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని