జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన ఏసీ బోగీల లింక్‌

విశాఖ-లింగంపల్లి జన్మభూమి రైలును విశాఖలో నిలిపేశారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. బోగిల లింక్‌ను సరి చేసిన అనంతరం 9.30 గంటలకు రైలు బయలుదేరింది.

Updated : 22 May 2024 10:47 IST

విశాఖ: విశాఖ-లింగంపల్లి జన్మభూమి రైలును విశాఖలో నిలిపేశారు. ఉదయం 6.20కు బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్‌ తెగింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. రైలును విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. బోగిల లింక్‌ను సరి చేసిన అనంతరం 9.30 గంటలకు రైలు బయలుదేరింది. ప్రస్తుతం జన్మభూమి రైలు 3 గంటలకుపైగా ఆలస్యంగా నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు