MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై అత్యవసర విచారణకు నిరాకరించిన జడ్జి

సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులో అత్యవసర విచారణకు భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు.

Updated : 11 Apr 2024 20:11 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులో అత్యవసర విచారణకు భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి... ఈ కేసులో ఎలాంటి ఊరట ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, తనకు ఏ విషయం తెలియదన్నారు. అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం రెగ్యులర్‌ కోర్టులో దరఖాస్తు చేయాలని ప్రత్యేక కోర్టు జడ్జి మనోజ్‌ కుమార్‌ సూచించినట్టు న్యాయవాది మోహిత్‌రావు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని