Supreme Court: కవితకు ఈడీ సమన్లపై సుప్రీంలో విచారణ

మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

Published : 05 Feb 2024 11:46 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తుదివిచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో పిటిషన్‌ను ధర్మాసనం జతపరిచిన విషయం తెలిసిందే.

కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కపిల్‌ సిబల్‌ అన్నారు. అది ఒక్కసారికే పరిమితమని.. ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ నోటీసులే చట్ట విరుద్ధమన్నది తమ వాదనని కపిల్ సిబల్ అన్నారు. అన్ని విషయాలను 16న జరిగే విచారణలో పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని