ED: ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన లేదు: న్యాయవాది మోహిత్‌రావు

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసీఆర్‌ ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు.

Updated : 28 May 2024 19:50 IST

దిల్లీ: దిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసీఆర్‌ ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ‘‘ఈడీ రిపోర్టులో ఎక్కడా కూడా కేసీఆర్‌ పేరు రాయలేదు. వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్న వారిని పరిచయం చేశాని చెప్పారు’’ అని మోహిత్‌రావు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని