అక్కడ పెదాలతోనే చూపిస్తారు!

సాధారణంగా దేన్నైనా, ఎవరినైనా చూపించాలంటే మన చూపుడు వేలును ఉపయోగించి చూపిస్తాం. కానీ, నికరగువా అనే దేశంలో పెదాలతో చూపిస్తారు. విచిత్రంగా ఉంది కదా! పొరపాటున చూపుడు వేలితో చూపిస్తే నేరమేమి కాదు గానీ, అక్కడి ప్రజలు దాన్ని అమర్యాదగా భావిస్తారు.

Published : 03 Mar 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా దేన్నైనా, ఎవరినైనా చూపించాలంటే మన చూపుడు వేలును ఉపయోగించి చూపిస్తాం. కానీ, నికరగువా అనే దేశంలో పెదాలతో చూపిస్తారు. విచిత్రంగా ఉంది కదా! పొరపాటున చూపుడు వేలితో చూపిస్తే నేరమేమి కాదు గానీ, అక్కడి ప్రజలు దాన్ని అమర్యాదగా భావిస్తారు.

పసిఫిక్‌, కరేబియన్‌ సముద్రాల మధ్యలో.. మధ్య అమెరికాలో ఉందీ నికరగువా దేశం. దాదాపు 64లక్షల మంది జనాభా ఉండే ఈ దేశం ఆదిమానవుల నాటి నుంచి నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉంటోంది. ఇక్కడ వాస్తవ స్థానికులతోపాటు యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లూ ఉన్నారు. అయితే, దేన్నైనా చూపడానికి ఈ దేశంలో ప్రజలు ఎవరూ చూపుడు వేలును ఉపయోగించరు. ఇందుకు బదులు పెదాలను అటు ఇటు తిప్పుతూ చూపిస్తుంటారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఇది విచిత్రంగా ఉండొచ్చు. కానీ, అక్కడి వారికి ఇదే అలవాటుగా మారిపోయింది. ఇలా పెదాలతో చూపించడం వెనుక ఓ కారణముందని చెబుతున్నారు. ఒకప్పుడు ఇక్కడి ప్రజల ముఖం బాతులా ఉండేదట. దీంతో ఏదైనా చూపించడానికి వారి పొడవాటి పెదాలను ఉపయోగించేవారట. అలా అక్కడి ప్రజలకు పెదాలతో చూపించడం అలవాటైందని ఓ వాదన ఉంది. ఇప్పటికీ దానిని కొనసాగించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు