ఆ ఊర్లో ఎప్పుడూ వర్షం పడదు.. ఎందుకంటే!

భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. కాలానుగుణంగా వాతావరణం మారుతుంటే వర్షకాలంలో వర్షాలు, వేసవికాలంలో ఎండ, శీలాకాలంలో చలి వచ్చి పోతాయి. కానీ, ప్రపంచంలో కొన్ని చోట్ల కాలానికి అతీతంగా ఏడాది పొడవునా చలి పంజా విసురుతుంటుంది.. ఎండలు మండిపోతుంటాయి. మరికొన్ని చోట్ల వర్షం

Published : 04 Jul 2021 14:52 IST


(Photo: Authentic Yemen facebook page)

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు సహజం. కానీ, ప్రపంచంలో కొన్ని చోట్ల కాలానికి అతీతంగా ఏడాది పొడవునా చలి పంజా విసురుతుంటుంది.. ఎండలు మండిపోతుంటాయి. మరికొన్ని చోట్ల వర్షం ఎడతెరపినివ్వకుండా కురుస్తూనే ఉంటుంది. అయితే, ఓ గ్రామంలో రోజూ ఉదయం పూట ఎండ.. రాత్రి పూట చలి ఉంటుంది. కానీ.. వర్షం మాత్రం ఇప్పటి వరకూ కురవలేదు. ఎందుకంటే ఆ గ్రామం మేఘాల పైన ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా..! మరి ఆ గ్రామం సంగతులేంటో చూద్దాం పదండి..

అల్‌ హుతైబ్‌.. యెమెన్‌ రాజధాని సనా పరిధిలో ఉన్న చిన్న గ్రామం. ఇది భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో భారీ కొండపై ఉంది. ఇక్కడ వర్షం కురవపోవడానికి కారణం.. గ్రామం మేఘాలకు పైన ఉండటమే.  మేఘాల కన్నా ఎత్తులో ఉన్న గ్రామంపై వర్షం ఎలా కురుస్తుంది?అది అసాధ్యం కదా! అందుకే ఈ గ్రామంలో వర్షం పడట్లేదు. అయితే, ఈ గ్రామానికి పర్యటకంగా మంచి పేరుంది. ఎత్తయిన కొండపై ఉన్న గ్రామంలో నిలబడి మేఘాల నుంచి వర్షం భూమిపై పడే సుందర దృశ్యాలను, ప్రకృతిని ఆస్వాదించొచ్చు. అందుకే ఏటా ఎంతో మంది సందర్శకులు ఈ గ్రామానికి వస్తుంటారు. ఇక్కడ పగటి వేళ సూర్యుడు ఉన్నంతసేపూ ఎండలు ఠారెత్తిస్తాయి. సూర్యుడు అస్తమించగానే చలి జోరు మొదలవుతుంది. మరుసటి రోజు సూర్యుడు వచ్చే వరకు చలి పులి వెంటాడుతుంది.

ఈ గ్రామంలో ప్రాచీన, ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ అల్‌ బోహ్రా లేదా అల్‌ ముఖర్మ తెగలకు చెందిన ప్రజలకు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరిని యెమెని కమ్యూనిటీస్‌గా పిలుస్తుంటారు. వీరంతా ముంబయికి చెందిన మహమ్మద్‌ బుర్హానుద్దీన్‌ నేతృత్వంలోని ఇస్మాయిలీ(ముస్లిం) విభాగం నుంచి వచ్చి స్థిరపడినవారేనట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని