Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 14 Jun 2023 09:00 IST

1. క్యాన్సర్‌ ఒకటే..మందులు వేర్వేరు!

క్యాన్సర్‌ బాధితుల్లో జన్యు అలంకరణ (జెనిటిక్‌ మేకప్‌) ఆధారంగా ఒక్కో వ్యక్తికి ఒక్కో విధమైన చికిత్సపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సీపీఎంబీ (సెంటర్‌ ఫర్‌ ప్లాంట్‌మాలిక్యులర్‌ బయాలజీ) ప్రయోగశాల పరిశోధనలు చేస్తోంది. ‘పర్సనలైజ్డ్‌ క్యాన్సర్‌ మెడిసిన్‌’ పేరుతో ఈ విధానం విదేశాల్లో పదేళ్ల క్రితం మొదలైంది. సీపీఎంబీ ప్రయోగశాల సంచాలకుడు రామకృష్ణ నేతృత్వంలో కొన్నేళ్లుగా క్యాన్సర్‌ జీనోమ్‌ అట్లాస్‌ డేటా విశ్లేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దీని మర్మమేమి..?

అత్యంత వివాదాస్పదంగా మారిన పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పోస్టు భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీల ప్రక్రియ ముగిసింది. కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టారు. కానీ పటమట కార్యాలయం పోస్టులు రెండు బ్లాక్‌ చేశారు. ఎవ్వరికి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సామర్థ్యం లేకుండానే రోడ్లపైకి..

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడి బస్సుల ఫిట్‌నెస్‌(సామర్థ్యం)పై చర్చ జరుగుతోంది. గతంలో బస్సులకు ఫిట్‌నెస్‌ లేని వాహనాలు పలు చోట్ల ప్రమాదాలకు గురయ్యాయి. కొందరు డ్రైవర్లు అజాగ్రత్తగా నడపడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. జిల్లాలో 510కి పైగా విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 150 వాహనాలకు మాత్రమే సామర్థ్య పరీక్షలు ముగిశాయి. మిగతావి రోడ్డెక్కితే విద్యార్థులు ఏ మేరకు భద్రంగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నమ్మారో.. ముంచారే!

అనకాపల్లి ఆర్డీఓకు తన సెల్‌ఫోన్లో ఓ యాప్‌లో జిల్లా కలెక్టర్‌ ఫొటోతో గిఫ్ట్‌కూపన్‌ ఒకటి వచ్చింది. దాన్ని తెరిచి చూడగా.. రూ. 50 వేలు పంపాలంటూ చెప్పడంతో ఆయన నగదు పంపేశారు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించారు. పోలీసులతో విచారణ చేయించారు. సైబర్‌ నేరానికి పాల్పడ్డ ఉత్తరాఖండ్‌కు చెందిన నికిల్‌ గోయన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటి నుంచే పన్నులు చెల్లించొచ్చు

పురపాలిక ప్రజలు వివిధ రకాల ఆస్తి పన్నులు చెల్లించేందుకు కార్యాలయాలకు వెళ్లనక్కరలేదు. ఇంటి నుంచే చెల్లించేలా చక్కటి అవకాశం ఉంది. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లించేలా సంబంధిత శాఖ ప్రత్యేక వాట్సాప్‌ నంబరును ఏర్పాటు చేసింది. సూచించిన నంబరు చరవాణికి అనుసంధానం చేసుకోవడం ద్వారా ఎంత పన్ను చెల్లించాలో వాట్సాప్‌లో తెలుస్తుంది. ఈ విధానం గత ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చినా పుర ప్రజల నుంచి స్పందన కరవైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అన్నవరం నుంచి ఆరంభం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నేటి నుంచి ఆరంభం కానుంది. అన్నవరం నుంచి నర్సాపురం వరకు తొలిదశ యాత్ర నిర్వహిస్తుండటంతో ఆసాంతం విజయవంతమయ్యేలా శ్రేణులు నిమగ్నమయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ మంగళవారం రాత్రి 9.30 గంటలకు అన్నవరం చేరుకుని బస చేశారు. బుధవారం ఉదయం వాహనానికి పూజలు ఉంటాయి. సాయంత్రం కత్తిపూడి కూడలి వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమ్మాయిలకు ప్రత్యేకంగా.. ఉపకారవేతనం తోడుగా విదేశాలకు!

విదేశాలకు వెళ్లాలంటే అంత సులభమైతే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి సమయాల్లో స్కాలర్‌షిప్స్‌ ఉపయోగపడతాయి. చాలా సంస్థలు విద్యార్థులకు ఇటువంటి ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకుని అవకాశం ఉన్నవాటికి దరఖాస్తు చేయడం ద్వారా అర్హత మేరకు ప్రయోజనం పొందవచ్చు. స్కాలర్‌షిప్స్‌ అనేవి విద్యార్థుల సమర్థత, మార్కులు, ఇతర అర్హతలను పరిశీలించి ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మత్తుదిగని పరివర్తన

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 180 సారా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 57 ప్రాంతాలు (13 పాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు ఎక్కువ) ఉన్నాయి. జిల్లాలో సారా నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అవగాహన సదస్సులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు సారా తయారీదారుల్లో మార్పు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సి ఉంది. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటినా సారాను పెద్దగా అదుపు చేయలేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వై-ఫై క్షేమమా!

ఒడిలో ల్యాప్‌టాప్‌. చేతిలో మొబైల్‌ ఫోన్‌. బల్ల మీద డెస్క్‌టాప్‌. గోడకు స్మార్ట్‌ టీవీ. ప్రస్తుతం ఇళ్లన్నీ ఇలాంటి డిజిటల్‌ పరికరాలతోనే శోభిల్లుతున్నాయి. వై-ఫై నెట్‌వర్క్‌తో వీటిని వాడుకోవటం పరిపాటిగానూ మారింది. వైర్‌లెస్‌తో అనుసంధానమయ్యే డిజిటల్‌ పరికరాల వినియోగం చాలా వేగంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో హోం నెట్‌వర్క్‌ భద్రతకూ ప్రాధాన్యం ఏర్పడింది. అలాగని వై-ఫై నెట్‌వర్క్‌ భద్రతను కాపాడుకోవటానికి టెక్‌ నైపుణ్యం సాధించాల్సిన పనేమీ లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐఐఐటీలు పిలుస్తున్నాయ్..!

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులకు పదోతరగతి తర్వాత ఇంటర్‌, ఇంజినీరింగ్‌ వరకు ఉచితంగా చదువుకునే అవకాశాలు ఐఐఐటీలు కల్పిస్తున్నాయి. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) ప్రకటన వెలువరించింది. ఏటా ప్రవేశాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటుతున్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో 337 మందికి రాష్ట్రంలోని వివిధ ఐఐఐటీల్లో సీట్లు లభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని