Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jun 2024 09:14 IST

1. శిరమెత్తిన అక్షరం.. చైతన్యం నింపిన శిఖరం

పామూరు మండలంలోని మోపాడు జలాశయం 1996లో తెగిపోయింది. అర్ధరాత్రి వేళ సంభవించిన వరదలతో ముప్ఫై మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ‘ఈనాడు’ ఛైర్మన్‌ రామోజీరావు ఎంతగానో కదిలిపోయారు. బాధితులకు తనవంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. సూర్య భవన్‌ పేరుతో అయిదు తరగతుల ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. పూర్తి కథనం

2. ఎందరికో మార్గదర్శి.. ఈ మహర్షి

రామోజీ ప్రతికా రంగప్రవేశం విశాఖ నుంచి ప్రారంభమై.. విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు విస్తరించింది. తర్వాత కోట్ల మందికి భక్తుల కొంగు బంగారమైన తిరుమల పాదాల చెంత ప్రారంభించారు. ఇక్కడి యూనిట్‌ను 1982 జూన్‌లో రేణిగుంట సమీపంలో ప్రారంభించారు.పూర్తి కథనం

3. రాజీలేని రాత.. అక్షర యోధుని జీవన యాత్ర

‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్రవేశారు. ఎక్కడ ప్రకృతి విపత్తి సంభవించినా బాధితులకు అండగా నిలిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ‘ఈనాడు’ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. పూర్తి కథనం

4. సేవా రాముడు.. గోదారోళ్ల దేవుడు

కడియం ప్రాంతంతో రామోజీరావుకు విడదీయరాని అనుబంధంమంటూ ఇక్కడి నర్సరీ రైతులు, పర్యాటక ప్రేమికులు గుర్తుచేసుకుంటున్నారు. ఇక్కడి మొక్కలను ఏరి కోరి ఎంపిక చేసేవారని రైతులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన రామోజీ ఫిలింసిటీకి లక్షలాది మొక్కలను ఇక్కడ్నుంచే పంపేవారమని చెబుతున్నారు.పూర్తి కథనం

5. సకల జన హితైషి... మరువలేని మహా రుషి

‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అంటూ తెలుగు వాకిళ్లలో వెలుగు చుక్కలా ప్రభవించింది ‘ఈనాడు’. ఇదే స్ఫూర్తితో సమున్నత పాత్రికేయ విలువలకు పట్టం కట్టిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు వైద్యాలయంలో కన్నుమూశారు.పూర్తి కథనం

6. అక్షరాలు.. అశ్రునయనాలు

ఈనాడు’ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి అందరినీ కలచివేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. కష్టకాలంలో ఎనలేనిసేవదించారని వక్తలు పేర్కొన్నారు. ‘ఈనాడు’తో ప్రజా సమస్యలు పరిష్కరిం చారన్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన కు నివాళులర్పించారు.పూర్తి కథనం

7. జనహితం.. ఆపన్నహస్తం

ప్రకృతి కన్నెర్ర చేసినా.. వరదలు ముంచెత్తినా.. ప్రజలు ఆపత్కాలంలో ఉన్నా.. ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నా.. నేనున్నానంటూ అందరికంటే ముందడుగువేసే మహోన్నత వ్యక్తి రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు. జనహితమే లక్ష్యంగా నిరంతం శ్రమించే కృషివలుడు. అలాంటి వ్యక్తి జిల్లాలోనూ తనదైన ముద్ర వేశారు. సారా ఉద్యమాన్ని ఉద్ధృత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు.. మద్యపాన నిషేధం వరకు ఉద్యమాన్ని కొనసాగించారు.  పూర్తి కథనం

8. అక్షర బ్రహ్మ సదాస్మరామి

ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆయన అక్షర రూపంలో ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే విరాళాల సేకరణకు రామోజీరావు ‘ఈనాడు’ ద్వారా పిలుపునిస్తే దాతలు ఉప్పెనలా కదిలి సాయం చేసేందుకు ముందుకొస్తారు. అనారోగ్యం బారినపడిన కడుపేదరికంతో చికిత్స పొందలేని పరిస్థితుల్లో ఉన్నారంటే చాలు.. ‘ఈనాడు’ తోడుగా నిలిచి భరోసా ఇచ్చేది. కథనాల రూపంలో ఎంతోమందిని కదిలించేది. పూర్తి కథనం

9. అడుగడుగునా వెలుగు జాడ!

అక్షర శిఖరమైన రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉంది. ఉమ్మడి పాలమూరులోనూ ‘ఈనాడు’తో పాటు గ్రూప్‌ సంస్థల ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి కథనం

10. ఊరికి ఉపకారం సేవకు ప్రతిరూపం.. రామోజీరావు సేవలు మరువలేనివన్న నాగన్‌పల్లి గ్రామస్థులు 

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని