Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jun 2023 17:05 IST

1. పనితీరు మార్చుకోకపోతే టికెట్‌ ఇచ్చేది లేదు: ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ హెచ్చరిక

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పనితీరులో 15 మంది ఎమ్మెల్యేలు బాగా వెనకబడ్డారని సీఎం జగన్‌ తెలిపారు. పనితీరు మెరుగుపరచుకోవాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ ప్రజల ఆశలను కేసీఆర్‌ కాలరాశారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్‌ కాలరాశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులు పొంగులేటి, అతని మిత్రబృందం కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దిశగా పలువురు నేతలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కిడ్నాపర్లు క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారు: ఎంపీ ఎంవీవీ

పోలీసులు చెప్పేవరకు తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్‌ అయినట్లు తెలియదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఈ వ్యవహారంపై విశాఖలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఈ నెల 12న తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. కిడ్నాపర్లు మా కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్‌ చేశారు’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. SBI ‘అమృత్‌ కలశ్‌’ గడువు పెంపు.. వడ్డీ, స్కీమ్‌ వివరాలు ఇవే..

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం జూన్‌ 30తో ముగియాల్సి ఉండగా.. తాజాగా ఆ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. గతంలోనూ ఈ గడువును ఓ సారి పునరుద్ధరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బోనస్‌ చెల్లింపులకు నిరాకరణ.. కోర్టు మెట్లెక్కిన ట్విటర్‌ ఉద్యోగులు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌పై (Twitter) ఆ సంస్థ ఉద్యోగులు కోర్టుకెళ్లారు. 2022 సంవత్సరానికి బోనస్‌ (Bonus) చెల్లింపులకు ట్విటర్‌ నిరాకరించినందుకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి పూర్తి బోనస్‌లో 50 శాతం చెల్లింపులు చేస్తామని ట్విటర్‌ తొలుత హామీ ఇచ్చింది. ఆ మొత్తాన్ని కూడా చెల్లించేందుకు ట్విటర్‌ నిరాకరించడంతో ఉద్యోగులు కోర్టుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆదిత్య ఠాక్రే, సంజయ్‌ రౌత్‌ సన్నిహితుల ఇళ్లలో ఈడీ సోదాలు..

కొవిడ్‌ సమయంలో ఫీల్డ్‌ ఆస్పత్రుల కేటాయింపులో జరిగిన అవకతవకల(Mumbai Covid scam)పై దర్యాప్తులో భాగంగా ఈడీ(ED) (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ముంబయిలోని 15 చోట్ల దాడులు నిర్వహించారు. వీటిల్లో ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జైస్వాల్‌ ఇల్లు, శివసేన యూబీటీ వర్గం నేత ఆదిత్య ఠాక్రే(Aditya Thackeray)కు అత్యంత సన్నహితుడిగా పేరున్న సూరజ్‌ చవాన్‌ గృహం కూడా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికాలో మోదీ.. వరుస భేటీలతో బిజీ బిజీ

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం న్యూయార్క్‌ చేరుకున్న మోదీకి.. భారత రాయబార సిబ్బంది, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ కంపెనీల సీఈవోలు, మేధావులతో వరుసగా భేటీ అవుతున్నారు. నోబెల్‌ గ్రహీతలు, ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, కళాకారులతోపాటు వైద్యరంగ నిపుణులు, ఇతర ప్రముఖులతో బిజీ బిజీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉక్రెయిన్‌ పోరాటాన్ని చూడు..: తైవాన్‌ విదేశాంగ మంత్రి

రష్యా అనే మహా శక్తి నుంచి తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్‌ వాసుల ప్రతిఘటనను చూసి తమ దేశ ప్రజలు స్ఫూర్తి పొందారని తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసఫ్‌ జాషువా వు పేర్కొన్నారు. తైవాన్‌ సందర్శనకు వచ్చిన విదేశీ జర్నలిస్టుల బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా అకారణంగా రష్యా చేపట్టిన యుద్ధం.. అది ప్రస్తుతం సాగుతున్న తీరు చైనాకు ఓ గుణపాఠం వలే ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్‌

దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్‌ (Tata Power) నిలిచింది. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ఈ విషయంలో రెండో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలవగా.. టాటా గ్రూప్‌నకే (Tata group) చెందిన టాటా స్టీల్ మూడో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు హెచ్‌ఆర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా ‘ర్యాండ్‌స్టాడ్‌ ఎంప్లాయిర్‌ బ్రాండ్‌ రీసెర్చి 2023’ పేరిట వార్షిక నివేదికను వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బిల్లు కట్టకుండానే 603 రోజులు 5-స్టార్‌ హోటల్‌లో.. చివరకు ఏమైందంటే?

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఒకరోజు ఉండాలన్నా సామాన్యులకు ఖరీదైన వ్యవహారం. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా ఏడాదిన్నరకు పైగా ఉన్నాడు. అదీ బిల్లు చెల్లించకుండానే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ వ్యవహారంపై తాజాగా దిల్లీలోని ‘ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఏరోసిటీలో రోజేట్‌ హౌస్‌ అనే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఉంది. దీంట్లో అంకుశ్‌ దత్తా అనే వ్యక్తి 2019 మే 30న ఒకరోజు నిమిత్తం చేరాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని