Atractive employer: అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్‌

టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్‌ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలిచింది. టాటా గ్రూప్‌నకే చెందిన టాటా స్టీల్‌, టీసీఎస్‌ సైతం టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Updated : 21 Jun 2023 14:57 IST

ముంబయి: దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్‌ (Tata Power) నిలిచింది. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ఈ విషయంలో రెండో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలవగా.. టాటా గ్రూప్‌నకే (Tata group) చెందిన టాటా స్టీల్ మూడో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు హెచ్‌ఆర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా ‘ర్యాండ్‌స్టాడ్‌ ఎంప్లాయిర్‌ బ్రాండ్‌ రీసెర్చి 2023’ పేరిట వార్షిక నివేదికను వెలువరించింది.

ఆర్థిక పరిపుష్టి, మంచి పేరు, ఉద్యోగంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలు వంటివి టాటా పవర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు దోహదం చేశాయని నివేదిక పేర్కొంది. 2022లో ఈ కంపెనీ 9వ ర్యాంకు సాధించింది. అమెజాన్‌, టాటా స్టీల్‌ ఈ విషయంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఐబీఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. స్టార్టప్‌ కంపెనీల్లో బిగ్‌ బాస్కెట్‌ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.63 లక్షల మందిపై ర్యాండ్‌స్టాడ్‌ ఈ సర్వే నిర్వహించింది. 32 మార్కెట్లు, 75 శాతం గ్లోబల్‌ ఎకానమీని కవర్‌ చేస్తూ సర్వే చేసింది. భారత్‌ విషయానికొస్తే.. ఉద్యోగి కంపెనీని ఎంచుకునేముందు వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌, కంపెనీకున్న పేరు, ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రయోజనాలు అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నారని నివేదిక తెలిపింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మరో పనిచేసుకోవడానికి, అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి అనుమతిస్తే ఆ కంపెనీకే జై కొడతామని 91 శాతం మంది అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని