Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 04 Sep 2023 17:08 IST

1. తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు.. కోస్తాంధ్రకు ఆరెంజ్‌ హెచ్చరికలు

రాష్ట్రంలో అక్కడక్కడా రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో కూడా దీని ప్రభావం కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కోస్తాంధ్ర, యానాంకు ఐఎండీ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. 11.5 సెం.మీ నుంచి 20.44 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ కీలక భేటీ.. 

దేశంలో ఎన్నికల హడావుడి నెలకొన్న వేళ.. కాంగ్రెస్‌ (Congress) పార్టీ కీలక సమావేశానికి సన్నద్ధమవుతోంది. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 16, 17వ తేదీల్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశాలు నిర్వహించనుంది. 18న పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు: కేటీఆర్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, భాజపాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకొనే భాజపా పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్‌ లోటుతో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు మిగులు రాష్ట్రమని కేటీఆర్‌ చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు శివకుమార్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వైద్య పరీక్షల అనంతరం శివకుమార్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నిందితుడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య ఘటనపై నిందితుడు కొన్ని పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారంపూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విమానాన్ని ఢీకొన్న పక్షి.. అత్యవసర ల్యాండింగ్‌..!

ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన ఒక విమానాన్ని టేకాఫ్‌ అయిన కాసేపటికే పక్షి (Bird) ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్‌ నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఇండిగో సంస్థకు చెందిన 6E2065 విమానం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌ నుంచి దిల్లీకి బయలుదేరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌కు ఓటుతో బుద్ధి చెబుతాం: మాలమహానాడు అధ్యక్షుడు

దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌.. వారిపైనే దాడులు చేయిస్తున్నారని మాల మహానాడు అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ (Arun Kumar) మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది దళితులపై దాడులు జరిగాయని, కొందరిని హత్య కూడా చేశారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ఎస్సీ మంత్రులు నోరెత్తకపోవడం దారుణమన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎయిర్‌ హోస్టెస్‌ అనుమానాస్పద మృతి.. ఫ్లాట్‌లోనే రక్తపు మడుగులో..!

మహారాష్ట్రలోని ముంబయిలో ట్రైనీ ఎయిర్‌ హోస్టెస్‌ అనుమానాస్పదంగా మృతిచెందారు. అంధేరీలోని తన ఫ్లాట్‌లోనే రక్తపు మడుగులో ఆమె విగతజీవిగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది.  ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్‌ ఓగ్రే (25) ఎయిర్‌ ఇండియా(Air India)లో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఈ ఏప్రిల్‌లోనే ముంబయి(Mumbai)కి వచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ నెల 8న ఈఎంఎస్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.200- 211

మంచినీరు, మురుగు నీరుకి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే ఈఎంఎస్‌ లిమిటెడ్‌ ఐపీఓ (EMS Ltd IPO) సెప్టెంబరు 8- 12 మధ్య జరగనుంది. ఒక్కో షేరు ధరను కంపెనీ సోమవారం రూ.200- 211గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.321 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ (EMS Ltd IPO)లో రూ.146.24 కోట్లు విలువ చేసే తాజా షేర్లు అందుబాటులో ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాలాలో పడి మహిళ గల్లంతు

నగరంలోని గాంధీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. మూసీ నది నాలాలో సుమారు 100 మంది సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: పురందేశ్వరి

భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతాన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) ధ్వజమెత్తారు. హిందూ ధర్మంపై వారు చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని