Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jul 2023 09:22 IST

1. ఈ చిక్కులు తొలగాలంటే.. రెక్కలు తొడగాలేమో..!

‘వామ్మో ఈ ప్రయాణం చేయలేకున్నాం. రెక్కలు ఉంటే బాగుండేది’. ‘ఎగిరే కార్లు వస్తే గానీ ఈ తిప్పలు తప్పవు.’ ఇదీ జిల్లాలోని రహదారులపై జనాల అభిప్రాయం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. అసలే గుంతలు తేలి అంతంతమాత్రంగా ఉన్న దారులు వర్షపు నీరు చేరి తటాకాలను తలపిస్తున్నాయి. వాటిని తప్పించే క్రమంలో వాహనచోదకులు సర్కస్‌ చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి గాయాలపాలవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అప్పు చెల్లించలేదని.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం

అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం బాధిత భార్యాభర్తలు నిందితుడు ఇంతియాజ్‌ షేక్‌ నుంచి కొంతకాలం క్రితం రుణం తీసుకున్నారు. దాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. ఈక్రమంలో నిందితుడి మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉద్యోగంలో చేరారా? క్రెడిట్‌ స్కోరు పెంచుకోండి

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తొలి జీతం అందుకోగానే అన్నీ సాధించామనే భావన కలుగుతుంది. అదే సమయంలో క్రమశిక్షణతో తమ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఆలోచనా ఉండాలి. అప్పుడే రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందీ లేని జీవితాన్ని ఆస్వాదించగలరు. ఇందులో కీలకమైనది క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోవడం. ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి క్రెడిట్‌ స్కోరును నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. దీనికి అనుసరించాల్సిన కొన్ని చిట్కాలేమిటో తెలుసుకుందాం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తలనొప్పి ఎక్కువగా ఉందా..

తలనొప్పి.. ఆఫీసులో ఒత్తిడి ఉన్నా.. ఎక్కువగా ఏదైనా ఆలోచిస్తున్నా ఇది వచ్చేస్తుంది. నొప్పి మొదలు కాగానే మందులు వేసేస్తుంటాం. కానీ సహజంగా ఎలా తగ్గించుకోవచ్చు.. కొంత మందిలో ఆహారపు అలవాట్ల కారణంగా తలనొప్పి వస్తే, మరికొందరిలో  తీపి తిన్నా, ఎండలో ఎక్కువ సేపు ఉన్నా, సమయానికి ఆహారం తీసుకోకపోయినా ఇది పలకరిస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బాబోయి.. బాదేస్తున్నారు..!

గతంలో తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు ఎట్టకేలకు రిజిస్ట్రేషన్లు (కన్వేయన్స్‌ డీడ్‌) జరుగుతున్నాయని సంతోషించాలో, వివిధ ఛార్జీల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్న తీరుకు బాధపడాలో తెలియక గాజువాక భూ బాధితులు తలలు  పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా  ఆదేశాలు సామాన్య టుంబాలకు శాపంగా పరిణమించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆయన జోక్యం ఉండొద్దు...

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి పిలుపొచ్చింది. గురువారం ఉదయం సీఎంతో అపాయింట్‌మెంట్‌ ఖరారు కాగానే ఆయన హుటాహుటిన తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. తొలుత మంత్రి బొత్స సత్యనారాయణతో బాలినేని సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో అరగంటకు పైగా భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జగనన్నా.. ఇది మీ ఇలాకా రోడ్డేనన్నా!

ముఖ్యమంత్రి నియోజకవర్గమంటే ప్రత్యేక దృష్టి ఉంటుంది. అభివృద్ధి పనులు పరుగులు పెట్టేవిధంగా నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆ మేరకు ప్రత్యేకత కనిపించకపోగా, పరిస్థితి దారుణంగా తయారైంది. ఫలితంగా మూడు జిల్లాల ప్రయాణికులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బస్సెక్కాలంటే.. బలమూ ఉండాలోయ్‌!

ఆర్టీసీ బస్సెక్కి హాయిగా ఇంటికి చేరుకోవచ్చు అనుకుంటే పొరపాటు పడినట్లే. రాష్ట్రంలో బస్సుల కండీషన్‌, గుంతల రోడ్లు అలా ఉన్నాయి. అందుకే.. బస్సు ఎక్కడమే కాదు.. అది దిగబడితే బయటకు తోసే బలమూ ఉండాలని ప్రయాణికులు ఛలోక్తులు వేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండల కేంద్రంలో బస్టాండు సమీపంలో రహదారిపై భారీ గుంత పడింది. రహదారి ముందున్న దుకాణదారులు అందులో ఎర్ర మొరుసు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టీనేజీ అమ్మాయిల అదృశ్యానికి సినిమాలే కారణం

కౌమార(టీనేజీ) బాలికల అదృశ్యంలో ప్రేమ వ్యవహారాలు, సినిమాలు, పోర్న్‌ వీడియోల ప్రభావం ఉందని, కరోనా సమయంలో చాలా మంది ఇంటర్నెట్‌కు అలవాటు పడి అనేక రకాల ప్రలోభాలకు గురవుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఓరుగల్లుపై జలఖడ్గం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అప్పటికే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జోరుగా కురిసిన వర్షంతో ఉగ్రరూపం దాల్చి పల్లెలు, పట్టణాలను ముంచెత్తాయి. కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్లు కాలువలను, పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు