Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Aug 2023 09:00 IST

1. 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దొప్పెర్ల పంచాయతీకి చెందిన వైకాపా నాయకుడు కొరుపోలు సరోజారావు (40 ఏళ్లు). ఈయన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ 37 మందిని ఓటర్ల జాబితాలో చేర్చారు. వీరంతా 1-26 డోర్‌ నంబర్‌లో నివసిస్తున్నట్లు ఓటర్ల జాబితాలో ఉంది. వాస్తవంగా వారెవరికీ సరోజారావుతో కానీ, ఆ డోర్‌ నంబరుతో కానీ సంబంధం లేదు. అసలు వీరిలో చాలామంది ఆ గ్రామంలోనే నివసించడం లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు ఏం పని?

‘ఓటర్ల జాబితా తయారీ సహా ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల్లో వాలంటీర్లు పాల్గొంటున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నాయి. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాముల్ని చేయొద్దని ఆదేశించినా వారి ప్రమేయం ఎందుకు ఉంటోంది? ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదు’ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలు గుప్పించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నేటి నుంచే శాసనసభ, మండలి సమావేశాలు

తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా వీటిని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార భారాసతో పాటు విపక్షాలైన కాంగ్రెస్‌, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే హోరెత్తుతున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించనుందని తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టెట్‌ ఫీజు మళ్లీ పెంచారు!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తు రుసుంను పాఠశాల విద్యాశాఖ రూ.100 పెంచడంపై విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో 2016లో తొలిసారి నిర్వహించిన టెట్‌కు రూ.200 ఫీజు ఉండగా, 2017లో ఆ రుసుం కొనసాగించారు. 2022 జూన్‌లో పరీక్ష ఫీజును రూ.300కి పెంచారు.  తాజాగా రూ.400కి పెంచారు. ఈసారి దాదాపు 3 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇళ్ల ప్లాట్లకూ రైతుబంధు పథకమా..!

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించినప్పటికీ రైతుబంధు పథకం కింద సొమ్ము చెల్లించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని 65 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయించినప్పటికీ సదరు భూమి యజమాని ఎ.స్వామినాయుడుకు రైతుబంధు మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ అపెక్స్‌ రిసార్ట్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చిలుక తప్పిపోయిందని రూ.10 వేల రివార్డుతో పోస్టర్లు

పెంపుడు జంతువులు, పక్షులతో తమకున్న అనుబంధానికి సంబంధించిన వీడియోలను ఇటీవలి కాలంలో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం చూస్తున్నాం. మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ జిల్లాకు చెందిన దీపక్‌ సోనీ కుటుంబం కథ వేరు. వీరి పెంపుడు చిలుక ఎటో ఎగిరిపోయింది. ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్నాతకోత్సవ వేదికపై నృత్యం.. చీవాట్లుపడ్డా కోటిమంది వీక్షణం

చదువు పూర్తి చేసుకొని పట్టా అందుకోబోతున్నాననే ఆనందంలో ఓ యువకుడు.. తన పేరు పిలవగానే నృత్యం చేస్తూ వేదిక ఎక్కాడు. ఈ ధోరణి నచ్చని కళాశాల అధ్యాపకులు అతడికి పట్టా ఇవ్వడానికి ససేమిరా అన్నారు. నృత్యం చేయడానికి ఇది వేదిక కాదని, పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారు. ముంబయిలోని నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఆర్య కొఠారి అనే విద్యార్థికి ఎదురైన అనుభవమిది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విడిపోతున్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని దంపతులు

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న తర్వాత తాము ఇక విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు బుధవారం వారు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై వారు సంతకాలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అదానీ చేతికి సంఘి సిమెంట్‌!

అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్స్‌ సంస్థ, గుజరాత్‌లోని సంఘి సిమెంట్‌లో మెజార్టీ వాటాను రూ.6000 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువకు కొనుగోలు చేయనుంది. సంఘి సిమెంట్‌ ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసేందుకు రూ.4500 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాటు, ఆ సంస్థకు చెందిన రూ.1500 కోట్ల రుణభారాన్నీ స్వీకరిస్తుందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. సంఘి సిమెంట్‌కు 6.1 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేరళలో అమెరికా మహిళపై సామూహిక అత్యాచారం

అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు..కొల్లంలోని ఓ ఆశ్రమానికి జులై 22న వచ్చిన 44 ఏళ్ల అమెరికా మహిళ జులై 31న ఒంటరిగా సమీపంలోని సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని