Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Aug 2023 09:22 IST

1. అయ్యవార్లు లేకుండానే ఆంగ్ల పాఠాలా?

ప్రభుత్వ పాఠశాలల్లో గణితం, సైన్సు, ఆంగ్లం సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు లేకుండానే పేదింటి పిల్లలంతా అంతర్జాతీయంగా ఎదుగుతారా? ఆంగ్ల భాష ఉపాధ్యాయుల్లేకుండానే టోఫెల్‌ పరీక్షకు ఎలా సన్నద్ధం చేస్తారు? ఇటీవల ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సిలబస్‌ అంటూ ఊదరగొడుతున్న సీఎం జగన్‌ గత నాలుగేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బోర్ల ఏర్పాటు.. ఉచితమంటూ ఉతికేశారు!

రైతుల భూముల్లో నాలుగేళ్లలో రెండు లక్షల బోర్లు తవ్విస్తామని ఎంతో ఘనంగా ప్రకటించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత 34 నెలల్లో తవ్వించిన బోర్లు ఎన్నో తెలుసా ? కేవలం 23,115.. వీటిలోనూ 2,420 బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించగా..203 బోర్లకే మోటార్లు బిగించారు. ఇదేనా సీఎం చెబుతున్న రైతు సంక్షేమం ? ఉచితంగా బోర్లు తవ్వించి బీడు భూముల్లో జలకళ తీసుకొస్తామని ముఖ్మమంత్రి జగన్‌ ఆర్భాటంగా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,32,157 మంది రైతులు ఎంతో ఆశతో దరఖాస్తులు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నాలుగేళ్లుగా ముగింపు లేని కథలా..!

అక్రమాలతో దాదాపు రూ.200 కోట్లు కొల్లగొట్టిన బీమా వైద్యసేవల (ఐఎంఎస్‌) కుంభకోణం దర్యాప్తు ఏళ్ల తరబడి కొలిక్కి రావడం లేదు. ఈ కేసు నమోదై వచ్చే నెలకు నాలుగేళ్లు పూర్తికావస్తుండగా.. ఇంతవరకు అభియోగపత్రం ఊసే లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఐఎంఎస్‌లో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత విజిలెన్స్‌ విచారణలో అక్రమాల వ్యవహారం బయటపడగా దీని ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (అనిశా) 2019 సెప్టెంబరులో కేసు నమోదు చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 62 కిలోల బరువెత్తిన 8 ఏళ్ల చిన్నారి.. గిన్నిస్‌ రికార్డ్‌ హస్తగతం

హరియాణాకు చెందిన 8 ఏళ్ల అశ్రియా గోస్వామి నమ్మశక్యం కాని రీతిలో 62 కేజీల బరువెత్తి ఔరా అనిపించింది. 30 సెకన్లలో 17 సార్లు క్లీన్‌ అండ్‌ జర్క్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ నెలకొల్పింది. పంచ్‌కుల జిల్లాకు చెందిన ఈ చిన్నారి తండ్రి అవినాష్‌కుమార్‌ స్థానికంగా ఓ జిమ్‌ సెంటర్‌ నడుపుతున్నారు. అశ్రియా మొదట్లో తండ్రి దగ్గరే వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణ తీసుకునేది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిరుద్యోగం భయపెడుతోంది

మనదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? అవినీతి, నేరాలు, ఆర్థిక స్థితిగతులపై వారి అభిప్రాయం ఎలా ఉంది? ఏది అతిపెద్ద సమస్య అని ఎక్కువ మంది భావిస్తున్నారు?.. ఈ ప్రశ్నలకు పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఇప్సాస్‌ గ్రూపు ‘ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యలు ఏమిటి?’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో సమాధానాలు చెబుతోంది. మార్కెట్‌ పరిశోధన, కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన ఇప్సాస్‌ గ్రూపు మనదేశం సహా వివిధ దేశాల్లోని తాజా సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంకా రెండు రోజులే.. సర్వే పూర్తికాలే

రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని పంద్రాగస్టున ప్రారంభిస్తామని సర్కారు ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అర్హుల ఎంపిక ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సరైన వివరాలున్న దరఖాస్తుల్లో మూడో వంతు కూడా సర్వే పూర్తి కాలేదు. ఇదేంటని అడిగితే.. సర్వే కోసం రెవెన్యూశాఖ నుంచి అధికారులు రావట్లేదని జీహెచ్‌ఎంసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వినపడుతోందా..

ఇయర్‌, హెడ్‌ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్నారా.. గంటల కొద్దీ వాటితోనే కాలం గడుపుతున్నారా.. అయితే జాగ్రత్త. ఎక్కువ శబ్దంతో వీటిని వినియోగించడం వల్ల కొందరిలో దీర్ఘకాలంలో వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం కన్పిస్తోందని ఈఎన్‌టీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి వివిధ రకాల చెవి సంబంధిత సమస్యలతో వారానికి 100 మంది రోగులు వస్తుంటే.. అందులో 15-20 మంది వరకు ఇయర్‌ ఫోన్లు, హెడ్‌ఫోన్లు వాడుతున్న వారేనని వైద్యులు చెప్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మానుకోట కాంగ్రెస్‌లో వర్గ పోరు!

అసెంబ్లీ  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహబూబాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఇక్కడ ముగ్గురు నేతలు వేర్వేరుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి, అతడి అనుచరులు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల నాటి నుంచి వర్గపోరు కొనసాగుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దారి తప్పిన ఈ-ఆటో

పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ కోసం రూ.21.18 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం కొనుగోలు చేసిన 516 ఈ-ఆటోలు రోడ్లుపైకి రాక ముందే పాడవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఏడాది జూన్‌ 8న జెండా ఊపి ప్రారంభించిన ఆటోలు అనేకచోట్ల పురపాలక కార్యాలయాలకే పరిమితమయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాక, డ్రైవర్ల కొరతతో వీటిని పక్కన పెట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తొలి 5జీ వైర్‌లెస్‌ వైఫై ‘ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌’

5జీపై ఒక ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌(ఎఫ్‌డబ్ల్యూఏ)ను ‘ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌’ పేరిట ఆవిష్కరిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ను అందించడం సవాలుగా ఉన్న ప్రాంతాల్లో వైర్లు లేకుండానే ఇంటర్నెట్‌ను అందించడమే ఎఫ్‌డబ్ల్యూఏ లక్ష్యమని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి దిల్లీ, ముంబయిలోని వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవలను దశల వారీగా దేశవ్యాప్తంగా అందజేస్తామని కంపెనీ తెలిపింది. గత 3-4 ఏళ్లలో ఇంట్లో వై-ఫై ఉండడం అవసరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని