Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Sep 2023 09:15 IST

1. ‘క్షమాభిక్ష’పై రాష్ట్రపతిదే తుది నిర్ణయం!

నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) బిల్లు-2023 ఆమోదం పొందితే.. రాష్ట్రపతి తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్లపై న్యాయస్థానంలో సవాల్‌ చేసే హక్కు ఉండదు. రాజ్యాంగంలోని అధికరణం 72.. రాష్ట్రపతికి క్షమాభిక్ష, ఉపశమనం లేదా శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి, తగ్గించడానికి, మార్చడానికి అధికారమిస్తుంది. అయితే దీన్ని న్యాయస్థానాల్లో సవాల్‌ చేయొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కారు.. బుజ్జగింపుల్లో జోరు!

శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను మూడు నెలల ముందుగానే ప్రకటించిన భారాస... కొన్ని నియోజకవర్గాల్లో తలెత్తిన అసమ్మతిని చల్లార్చడం, నాయకులను బుజ్జగించి సమస్యలు లేకుండా చూసుకోవడంలోనూ ముందుంది. అసంతృప్తులను, అసమ్మతి వ్యక్తంచేసిన వారిని వదిలేయడం లేదు. వారు పార్టీలోనే కొనసాగేలా, ప్రకటించిన అభ్యర్థుల విజయం కోసం పనిచేసేలా చూసేందుకు అధినాయకత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పన్ను రిఫండు ఆలస్యమైతే

గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31తో గడువు ముగిసింది. ఆలస్యపు రుసుము చెల్లించి డిసెంబరు 31 వరకూ వీటిని దాఖలు చేయొచ్చు. పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ఉన్న సమాచారం మేరకు ఆగస్టు 30 నాటికి 5.77 కోట్ల రిటర్నులు ప్రాసెస్‌ అయ్యాయి. ఇందులో కొందరికి రిఫండు అందింది. కొంతమంది రిటర్నులు ప్రాసెస్‌ అయినట్లు చూపించినా రిఫండు రాలేదు. ఈ జాప్యానికి కారణాలేమిటి?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏలేది దోచేది మేమే !

ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక రీచ్‌కు ఎలాంటి అనుమతి లేదు. దీనిపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ ఫిర్యాదు చేసినా గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇక్కడ భారీగా ఇసుక నిల్వ చేశారు. తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రీచ్‌ వద్ద టన్ను రూ.475కు అమ్మాలి కానీ... రూ.800కు విక్రయిస్తున్నారు. వేబిల్లు ఇస్తున్నా.. పరిమాణం, ఇసుక ధర పేర్కొనడం లేదు. పెడనలో మూడు లారీల బుసక తరలిస్తుంటే అధికారులు జరిమానా వేసి కేసు పెట్టారు. కానీ.. శ్రీకాకుళం రేవు వైపు కన్నెత్తి చూడటం లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అడ్డగోలుగా ‘ఆమె’కు అందలం

ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిన తర్వాత తిరిగి తీసుకోవాలంటే తగిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా వ్యవహరించారు విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(విమ్స్‌)లో అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తూ ఓ ఉద్యోగిని తనకు విదేశాల్లో ఉద్యోగం వచ్చిందని ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆమె నియామకం డీఎస్సీ ద్వారా జరిగింది. అయితే ఆమెకు విదేశాల్లో ఉపాధి లభించకపోవటంతో తిరిగి విమ్స్‌లో చేరేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ రైలు మార్గంలో కంకరరాళ్లు ఉండవు

రైలు మార్గమంటే ఉక్కు పట్టాలు, కంకర రాళ్లు, కాంక్రీటు స్లీపర్లు సహజం. దీనికి కొంత భిన్నంగా.. కంకరరాళ్లు లేకుండా పూర్తిగా కాంక్రీటు స్లాబులతో రైలుమార్గాన్ని ముంబయి-అహ్మదాబాద్‌ బులెట్‌ రైలు ప్రాజెక్టులో భాగంగా సిద్ధం చేయనున్నారు. సూరత్‌ నుంచి దీని పనులు మొదలయ్యాయని ‘జాతీయ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ తెలిపింది. జపాన్‌లోని షింకన్‌సేన్‌ హైస్పీడ్‌ రైలు వ్యవస్థలో వాడే తరహాలో ‘జె-స్లాబ్‌ బల్లాస్ట్‌లెస్‌ ట్రాక్‌ సిస్టం’ను దేశంలో తొలిసారిగా చేపట్టామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇవ్వాల్సింది ఇచ్చుకో.. నచ్చినట్టు కట్టుకో..!

విజయవాడ నగర శివారు... తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు.. కొనుగోలుదారులను నిట్టనిలువునా ముంచేస్తున్నాయి. మున్సిపాలిటీకి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ నమూనా ఒకటి ఉంటే.. క్షేత్రస్థాయిలో నిర్మాణం జరుగుతున్నది మరొకటి. ఇందుకు రెండు నమూనాలను సిద్ధం చేసి ఒకటి అనుమతుల కోసం పెడుతున్నారు. నిర్మాణం కోసం మరొకటి తయారుచేసి, దానినే కొనుగోలుదారులకు చూపించి బురిడీ కొడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కష్టం తెదేపాది.. రంగులు వైకాపావి

అనంతపురం జిల్లా పరిధిలో పలుచోట్ల తెదేపా ప్రభుత్వ కాలంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధి పుట్లూరు రోడ్డులో సుమారు 6,000 టిడ్కో ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలను 70శాతం పూర్తి చేశారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నాలుగేళ్లు దాటినా వాటిని పూర్తి చేసి లభ్ధిదారులకు అందజేయడంలో వైఫల్యం చెందింది. 70 శాతం పూర్తయిన ఇళ్లకేమో ఆగమేఘాలపై వైకాపా రంగులేసి ముస్తాబు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పర్యాటకం.. అంతా బూటకం!

పర్యాటక రంగంలో వచ్చే పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అరచేతిలో స్వర్గాన్ని చూపిప్తోంది. సీఎం జగన్‌ చెబుతున్న మాటలు ఆకాశానికి నిచ్చెనలు వేసేలా ఉంటున్నాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణ పనులకే రెండేళ్లయినా దిక్కూ మొక్కూ లేదు. విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా అత్యాధునిక వసతులు అందుబాటులోకి తేవాలని జగన్‌ చెప్పడం విడ్డూరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పుగా ఎంతైనా మద్యం!

తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఎస్‌బీసీఎల్‌) సంస్థ వ్యాపారులకు మద్యాన్ని అప్పుగా ఇచ్చే విషయంలో ఉదారత కనబరుస్తోంది. వ్యాపారులు ఎంత సరకు కావాలంటే అంత అప్పుగా తీసుకోవచ్చంటూ గేట్లెత్తేసింది. కావాల్సినంత మొత్తానికి పోస్ట్‌ డేటెడ్‌ చెక్కు ఇచ్చి మద్యం తీసుకెళ్లేందుకు అనుమతిస్తోంది. అయితే చెక్కులు సెప్టెంబరు 30లోపు చెల్లుబాటయ్యేలా ఉండాలంటూ షరతు విధించింది. అంటే.. మద్యాన్ని తీసుకెళ్లే వ్యాపారులు అందుకు సంబంధించిన సొమ్మును సెప్టెంబరు నెలాఖరులోపు కట్టాల్సి ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని