మేడారం వైపు భారీగా ట్రాఫిక్ జామ్‌.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

మేడారం మహా జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. 

Updated : 23 Feb 2024 20:48 IST

తాడ్వాయి: మేడారం మహా జాతరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. దారులన్నీ మేడారానికి అన్నట్టుగా.. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం - తాడ్వాయి మధ్య సుమారు 15 కిలోమీటర్ల మేర, పస్రా నుంచి గోవిందరావుపేట వరకు ఐదు కి.మీ  మేర ట్రాఫిక్ జామ్‌ అయింది. ఇరువైపుల వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుగు ప్రయాణంలో నార్లపూర్‌ నుంచి బయ్యక్కపేట, భూపాలపల్లి మండలం దూదేకులపల్లి నుంచి గొల్లబుద్దారం, రాంపూర్ మీదుగా కమలాపూర్ క్రాస్ రోడ్డు వరకు ‘వన్‌ వే రహదారి’ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాహనాలు కాటారం మీదుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

గుండెపోటుతో ఇద్దరు భక్తుల మృతి

జాతరలో ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతి చెందారు. వారికి తీవ్రంగా ఛాతి నొప్పితో రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉచిత వైద్య శిబిరానికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతులు పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి (68), విజయవాడకు చెందిన సాంబయ్య (40)గా పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు