Traffic jam: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Published : 14 Apr 2024 15:41 IST

శంషాబాద్‌: హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైవంతెన నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అరకిలోమీటరు దూరం వెళ్లేందుకు సుమారు గంట పాటు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ పనులు నత్తనడక సాగుతుండటంతో గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయకుండా నిర్మాణ పనులు చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని