
సుజనా అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్: భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతిచ్చింది. అమెరికా వెళ్లే ముందు వచ్చిన తర్వాత సీబీఐకి వివరాలు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తయారీలో సాంకేతికతపై చర్చించేందుకు యూఎస్ వెళ్లనున్నట్లు సుజనా చౌదరి కోర్టుకు తెలిపారు. సీబీఐ లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున సుజనా హైకోర్టు అనుమతి కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.