Ts Elections: ఉపాధ్యాయ సంఘాల పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు

అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించలేదంటూ ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది.

Published : 29 Nov 2023 17:37 IST

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించలేదంటూ ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది. పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వకపోవడంతో ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఎన్నికల విధుల్లో ఉండి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామని ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 28వ తేదీ వరకు 1.75లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని కోర్టుకు వివరించారు. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని