MP Avinash: ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 28 Mar 2024 17:42 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదని అవినాష్‌ తరఫు న్యాయవాది వాదించారు. నెల రోజుల క్రితమే ఎన్‌ఐఏ కేసులో అప్రూవర్‌ వేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ అనుమతించిందని హైకోర్టు పేర్కొంది. అప్రూవర్‌కు అడిగే హక్కు ఉందని డివిజన్‌ బెంచ్‌ తీర్పులో స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది. మరోవైపు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా.. విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని