Seethakka: మేడారం జాతరకు 1.35 కోట్ల మంది భక్తులు: మంత్రి సీతక్క

మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Published : 24 Feb 2024 15:41 IST

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని చెప్పారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు. 

‘‘20శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా మా వంతు కృషి చేశాం. జాతరకోసం ఆర్టీసీ దాదాపు 6వేల బస్సులను కేటాయించి.. 12వేల ట్రిప్పులు నడిపింది. మహాజాతరకు వచ్చిన భక్తుల్లో 5090 మంది తప్పి పోయారు. వారిలో 5062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తాం. తప్పిపోయిన వారి వివరాల కోసం మీడియాపాయింట్‌ , జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన మిస్సింగ్‌ పాయింట్‌లో సంప్రదించాలి. సోమవారం నుంచి మేడారంలో పది రోజుల పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతాయి. ఇందుకోసం దాదాపు 4వేల మంది కార్మికులను నియమించాం’’ అని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని