TS SSC Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. నిర్మల్‌ ఫస్ట్‌.. వికారాబాద్‌ లాస్ట్‌

తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 

Updated : 10 May 2023 12:49 IST
టెన్త్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌: తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 

ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 59.46 శాతంతో వికారాబాద్‌ చివరి స్థానంలో నిలిచినట్లు వివరించారు. 25 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదని సబిత చెప్పారు. జూన్‌ 14 నుంచి 22వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఈనెల 26లోపు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మంత్రి వివరించారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉత్తీర్ణత ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని