క్లీన్‌ సిటీపై అమెరికన్‌ బ్లాగర్‌ వీడియో.. తన ఆకాంక్షను పంచుకున్న ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా ఓ వీడియోను ‘‘ఎక్స్’’ వేదికగా పంచుకున్నారు. అదే సమయంలో తన ఆకాంక్షను తెలియజేశారు.

Published : 23 May 2024 00:05 IST

Anand Mahindra | ఇంటర్నెట్‌డెస్క్‌:  దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (Indore) వరుసగా ఏడోసారి తొలి స్థానం దక్కించుకొంది. 2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు (Swachh Survekshan Awards 2023)ను ఈ ఏడాది జనవరిలో సొంతం చేసుకుంది. దేశీయ పర్యటనకు వచ్చిన ఓ అమెరికన్‌ బ్లాగర్‌ ఈ క్లీన్‌ సిటీని చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నారు.

అమెరికన్‌ ట్రావెల్ బ్లాగర్ మాక్స్ మెక్‌ఫార్లిన్ ఇందౌర్‌లో స్ట్రీట్‌ఫుడ్‌స్టాల్స్‌ ఏవిధంగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నారో ఆ వీడియోలో చూపించాడు. ప్లాస్టిక్‌ ప్లేట్లు వాడకుండా స్టీల్‌ పాత్రలు వాడటం, నీరు వృధా కాకుండా వారు పాటిస్తున్న విధానాల గురించి అందులో మాట్లాడాడు. ఓ వ్యక్తి తినే ఆహారం పొరపాటున వీధిలో నేలపై పడితే వెంటనే దాన్ని అతను అక్కడి నుంచి తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం చూసి అవాక్కయ్యాడు. ఇలా అక్కడ గమనించిన ప్రతీ చిన్న అంశాన్ని అందులో బంధించాడు.

కేంద్రానికి ఆర్‌బీఐ ‘డబుల్‌’ బొనాంజా.. డివిడెండ్‌ కింద ₹2.11 లక్షల కోట్లు

ఈ వీడియోను మహీంద్రా ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నారు. దేశమంతా ఇలానే ఉండాలంటూ తన ఆకాంక్షను పోస్టులో వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నగర సంస్కృతి, పరిశుభ్రత కోసం వారు చూపుతున్న ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉండగా.. ఇందౌర్‌ నగరం వ్యర్థాల నిర్వహణ కోసం ఏటా రూ.200కోట్లు ఖర్చు చేస్తోంది. రోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని