Vizag: కంటెయినర్‌లో డ్రగ్స్‌.. మా వల్ల సోదాలు ఆలస్యం కాలేదు: విశాఖ సీపీ

విశాఖ పోర్టులో కంటెయినర్‌లో డ్రగ్స్‌ కేసుపై నగర సీపీ రవిశంకర్‌ స్పందించారు. దీన్ని పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.

Updated : 22 Mar 2024 16:08 IST

విశాఖపట్నం: విశాఖ పోర్టులో కంటెయినర్‌లో డ్రగ్స్‌ కేసుపై నగర సీపీ రవిశంకర్‌ స్పందించారు. దీన్ని పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ డాగ్‌ స్క్వాడ్‌ సహకారం కోరితే ఇచ్చినట్లు తెలిపారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కంటెయినర్‌ టెర్మినల్‌ తమ కమిషనరేట్‌ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్‌ ఎస్పీ పిలిస్తే వెళ్లినట్లు వివరించారు. సీబీఐ విధి నిర్వహణకు తమవల్ల ఆటంకం కలగలేదని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని