Andhra news: భీమవరంలో అతిరాత్ర మహోత్కృష్ట సోమయాగం: గజల్‌ శ్రీనివాస్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మే 15 నుంచి 25 వరకు మహోత్కృష్ట సోమయాగం నిర్వహించనున్నట్టు సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌ అధ్యక్షులు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated : 20 Apr 2024 21:28 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మే 15 నుంచి 25 వరకు మహోత్కృష్ట సోమయాగం నిర్వహించనున్నట్టు సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌ అధ్యక్షులు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నెలమూరు ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో, జంధ్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రాజశ్యామల, పుత్ర కామేష్ఠి, దశమహావిద్యా సహిత అతిరాత్ర మహాయగం కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎంతో మంది పీఠాధిపతులు, మహా సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, చెరుకువాడ రంగశాయి, కంతేటి వెంకట్రాజులు ఈ యాగానికి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని