KCR: కేసీఆర్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

Updated : 08 Dec 2023 15:29 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని తెలిపారు.

‘‘బాత్‌రూమ్‌లో జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలి. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు’’ అని హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని