Viveka Murder case: న్యాయవాది సలహా మేరకు లొంగిపోతా: ఎర్ర గంగిరెడ్డి

సీబీఐ కోర్టులో ఎప్పుడు లొంగిపోవాలనే విషయంపై తన న్యాయవాదితో చర్చిస్తున్నట్లు వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు.

Updated : 04 May 2023 14:43 IST

హైదరాబాద్: సీబీఐ కోర్టులో ఎప్పుడు లొంగిపోవాలనే విషయంపై తన న్యాయవాదితో చర్చిస్తున్నట్లు వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. తన న్యాయవాది సలహా మేరకు లొంగిపోనున్నట్లు చెప్పారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఏప్రిల్‌ 27న బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మే 5లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది. జూన్ 30వ తేదీ వరకు దర్యాప్తునకు గడువు ఉన్నందున అప్పటివరకు మాత్రమే ఎర్ర గంగిరెడ్డిని రిమాండ్‌కు తరలించాలని తీర్పు వెల్లడించిన సమయంలో హైకోర్టు షరతు విధించింది. జూన్ 30 తర్వాత ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుండడంతో ఈ అంశంపై ఎర్ర గంగిరెడ్డి తన న్యాయవాదితో చర్చిస్తున్నారు. రేపటిలోగా ఎర్ర గంగిరెడ్డి లొంగిపోకపోతే సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు