₹602 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు

భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని ఎన్సీబీ భగ్నం చేసింది.

Updated : 28 Apr 2024 18:22 IST

దిల్లీ: దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్‌ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB) చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రూ.602 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్‌ తీరంలో ఏకంగా 86 కిలోలు డ్రగ్స్‌ను అధికారులు సీజ్‌ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. వారిని చుట్టిముట్టిన అధికారులు 14 మందిని అరెస్టు చేశారు. వీరిని పాకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు.

నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

ఇటీవల గుజరాత్‌, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్‌ ల్యాబ్‌ల గుట్టును నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రట్టు చేసింది. ఈ ప్రాంతంలోని మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గుజరాత్‌ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని