Pune Car Crash: పుణె కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

పుణె కారు ప్రమాదం కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 24 May 2024 21:45 IST

పుణె: మహారాష్ట్రలోని పుణె (Pune)లో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు (Pune Porsche Crash)లో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌ జగ్దలే, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వనాథ్‌ తోడ్కరీలపై ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇద్దరినీ యెరవాడ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్‌ చేశారు. ప్రమాదం అనంతరం యువకుడిని తరలించింది ఇక్కడికే. మరోవైపు, ఈ కేసును పుణె క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

రేవ్‌ పార్టీపై రగడ.. ‘ఉడ్తా బెంగళూరు’పై కన్నడనాట మాటల యుద్ధం

ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్‌కు 15 గంటల్లోనే జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్‌ జస్టిస్‌ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్‌ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్‌ హోంలో ఉంచాలని ఆదేశించింది. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్‌ల యజమానులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని