Ashwini Vaishnaw: భారత్‌లో శరవేగంగా 5జీ సేవలు.. 10 నెలల్లోనే 3 లక్షలకుపైగా సైట్లు: అశ్వినీ వైష్ణవ్‌

5జీ నెట్‌వర్క్‌ సేవల విషయంలో భారత్‌ శరవేగంగా దూసుకెళ్తోందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ప్రారంభించిన 10 నెలల్లోనే 3లక్షలకు పైగా సైట్లు ఏర్పాట్లు అయ్యాయని తెలిపారు. 

Updated : 02 Aug 2023 00:01 IST

దిల్లీ: ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రైవేట్‌ టెలికాం సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో తమ 5జీ సేవలతో వేగంగా దూసుకుపోతున్నాయి. ఇతర టెలికాం సంస్థలు అయిన    వొడాఫోన్-ఐడియా 5జీ నెట్ వర్క్‌ ప్రయత్నాలలో ఉంది. 5జీ నెట్‌ వర్క్‌ను ప్రారంభించిన 10 నెలల్లోనే భారత్‌లో 3 లక్షలకు పైగా సైట్లు ఏర్పాటు అయ్యాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మొత్తం 714 జిల్లాలకు ఈ సేవలు విస్తరించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ నెట్‌వర్క్‌ సేవలు భారత్‌లో కొనసాగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. గతేడాది అక్టోబరు 1న ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. ఈ సేవలు ప్రారంభమైన ఐదు నెలల్లోనే లక్ష 5జీ సెట్లు ప్రారంభం కాగా, ఎనిమిది నెలల్లోపే 2 లక్షల సైట్లుకు ఈ సేవలు విస్తరించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు