Jharkhand: 92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!

ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌కు చెందిన ఖలీల్‌ అన్సారీ.. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Published : 01 Jun 2024 15:49 IST

రాంచీ: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. కానీ, తనకు 92 ఏళ్లు వచ్చేవరకు అసలు పోలింగ్‌ కేంద్రం వైపు చూడని ఓ వ్యక్తి.. ఎట్టకేలకు జీవితంలో తొలిసారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయనే ఝార్ఖండ్‌ (Jharkhand)లోని సాహిబ్‌గంజ్‌కు చెందిన ఖలీల్‌ అన్సారీ. దృష్టి లోపంతో బాధపడుతున్న ఆయన.. రాజ్‌మహల్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధి మండ్రోలోని పదో నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో మండ్రో పోలింగ్‌ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఖలీల్‌ అన్సారీ తనకు ఓటు లేదని, ఇప్పటివరకు అసలు ఓటే వేయలేదని తెలిపారు. దీంతో వెంటనే ఆయన పేరును ఓటరు జాబితాలో చేర్చాలని ఝార్ఖండ్‌ ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) రవికుమార్‌ ఆదేశించారు. ఈ క్రమంలోనే జిల్లా అధికారులు అన్సారీ వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈవీఎంలను చెరువులోకి విసిరి.. బాంబులతో దాడి చేసి..

‘‘మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఓటేసిన అనంతరం అన్సారీ తెలిపారు. ఇదిలాఉండగా.. ఝార్ఖండ్‌లో మొత్తం 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. చివరిదశలో భాగంగా శనివారం మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో (దుమ్కా, రాజ్‌మహల్‌, గొడ్డా) పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడుచోట్ల కలిపి 46.80 శాతం ఓటింగ్‌ నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని