Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Air India Express: ఇంజిన్‌లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది.

Updated : 19 May 2024 13:29 IST

బెంగళూరు: బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడమే అందుకు కారణం. 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

బెంగళూరు విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే సిబ్బంది మంటల్ని గుర్తించారు. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11:12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండయ్యింది. మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తూనే సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.

సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం

ఎట్టకేలకు రన్‌వేపై క్రాష్‌ ల్యాండ్‌ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్‌ ఎగ్జిట్‌ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికే ఫైరింజన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. విమానం ఆగిన వెంటనే మంటలను ఆర్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను రన్‌వే నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి తీసుకెళ్లారు.

జరిగిన ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విచారం వ్యక్తం చేసింది. నియంత్రణా సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని తెలిపింది. మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలసుకుంటామని పేర్కొంది. శుక్రవారం దిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఏసీలో మంటలు రావటంతో వెంటనే దిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని