Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్‌ పైకప్పునుంచి ధార!

ఎయిర్‌ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. క్యాబిన్‌లో నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Published : 01 Dec 2023 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమాన ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. క్యాబిన్‌ పైకప్పు నుంచి నీటి లీకేజీ (Water Leakage)తో వారు ఇబ్బంది పడ్డారు. లండన్‌లోని గాట్విక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమృత్‌సర్‌ బయల్దేరిన ‘ఎయిర్‌ ఇండియా’ (Air India) విమానంలో ఈ ఘటన వెలుగుచూసింది. గత వారం చోటుచేసుకున్న ఈ లీకేజీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని అనూహ్య ఘటనగా పేర్కొన్న విమానయాన సంస్థ.. జరిగినదానిపై విచారం వ్యక్తం చేసింది.

భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!

ఎయిరిండియా విమానం (ఏఐ 169).. నవంబరు 24న గాట్విక్‌ నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరింది. అంతలోనే ప్రయాణికులు కూర్చునే క్యాబిన్‌ పైకప్పు నుంచి ఒకచోట నీటి లీకేజీ మొదలైంది. నీళ్లు ధార కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే.. లీకేజీ కింది సీట్లలో కూర్చున్న ప్రయాణికులను తక్షణమే ఖాళీగా ఉన్న వేరే చోటికి మార్చినట్లు ‘ఎయిర్‌ ఇండియా’ సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అయితే, లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని