Aircraft Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్‌

Aircraft Landing: సాంకేతిక లోపంతో అత్యవసరంగా దిగిన ఓ విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై దొర్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. 

Updated : 12 Jul 2023 11:47 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఓ విమానం (Aircraft) సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది.. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

హాల్ (HAL) ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bengaluru Airport) బయల్దేరిన ప్రీమియర్‌ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో సాంకేతిక సమస్య (technical issue) ఎదురైంది. ఈ విమానం టేకాఫ్‌ అయిన తర్వాత ముందు వైపునున్న నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ రీట్రాక్ట్‌ అవలేదు. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. హాల్‌ ఎయిర్‌పోర్టులో విమానం దిగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ (Emergency Landing) సమయంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకెళ్లింది. అప్పటికే నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని