Amit Shah: ‘వారి ప్రేమలే పార్టీలను చీల్చాయి’: ఎన్సీపీ, శివసేన చీలికలపై అమిత్‌ షా

శివసేన, ఎన్సీపీలో వచ్చిన చీలికలపై భాజపా అగ్రనేత అమిత్‌ షా (Amit Shah) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 

Published : 20 Mar 2024 18:23 IST

దిల్లీ: శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలికలకు తాము కారణం కాదని భాజపా(BJP) అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. ‘న్యూస్‌ 18’ ఆధ్వర్యంలోని రైజింగ్  భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీలను చీలుస్తున్నారని మాపై ఆరోపణలు చేసేవారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray)కు ఉన్న ‘పుత్ర ప్రేమ్‌’(కుమారుడిపై ప్రేమ).. శివసేన రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమైంది.  ఏక్‌నాథ్‌ శిందే అర్హతకు తగ్గట్టుగా బాధ్యతలు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ఎన్సీపీ విషయానికి వస్తే.. శరద్‌ పవార్(Sharad Pawar) ‘పుత్రి ప్రేమ్‌’(కూతురిపై ప్రేమ) దానిని చీల్చింది. అజిత్‌ పవార్‌కు సముచిత గౌరవం దక్కితే.. ఆయన బయటకు వచ్చేవారే కాదు’ అని అమిత్‌ షా విశ్లేషించారు.

భాజపా నిరాకరిస్తే.. స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్‌ గాంధీ?

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి శివసేన, ఎన్సీపీ (ఎంవీఏ) మహరాష్ట్ర(Maharashtra)లో అధికారంలోకి వచ్చాయి. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2022లో ఏక్‌నాథ్‌ శిందే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బయటకు వెళ్లి, భాజపాతో చేతులు కలిపారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. భాజపా,  శివసేన(శిందే వర్గం) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. గత ఏడాది అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి.. తన మద్దతుదారులతో కలిసి భాజపా ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఇదిలాఉంటే.. తమ కూటమి మహారాష్ట్రలో 40కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని సీట్ల సర్దుబాటు సందర్భంగా అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని