Anand Mahindra: సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రికి ఆనంద్‌ మహీంద్రా బిగ్‌ గిఫ్ట్‌

సమాజంలో జరిగే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, స్ఫూర్తివంతమైన కథనాల్ని వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. అంతేకాదు అవసరంలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటుంటారు.

Updated : 23 Mar 2024 17:57 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా తన వాగ్దానాన్ని నెరవేర్చారు. భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌కు థార్ జీపును బహుమతిగా ఇచ్చారు. భారత జట్టులోకి సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన తర్వాత కుమారుడి కోసం పడిన కష్టాన్ని తలుచుకుని నౌషాద్‌ భావోద్వేగానికి గురయ్యారు. 

సర్ఫరాజ్‌ తమ్ముడు ముషీర్ ఖాన్ సైతం రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు. కొడుకులిద్దరినీ క్రికెటర్లుగా తయారుచేసిన నౌషాద్ ఖాన్‌కు మహీంద్రా థార్ జీపును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని గతంలో వాగ్దానం చేశారు ఆనంద్‌ మహీంద్రా. భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలనే కలను సాకారం చేసుకునేందుకు సర్ఫరాజ్‌కు అతని తండ్రి చేసిన త్యాగాలే సహాయపడ్డాయని కొనియాడారు.

సర్ఫరాజ్ అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతను అరంగేట్రం చేసిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. ముంబయి-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన మూడు టెస్టుల్లో ముంబయి తరపున మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

దీంతో చెప్పినట్లుగానే మహీంద్రా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌కు థార్‌ జీపును బహుమతిగా పంపారు. ఖాన్‌ కుటుంబం దాన్ని అందుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు. సర్ఫరాజ్‌తో పాటు టెస్టుల్లో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ తండ్రికి ఎప్పుడు గిఫ్ట్ పంపిస్తారని కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని