Kejriwal Arrest: కేజ్రీవాలే సీఎంగా ఉంటారు.. మంత్రి అతిషీ

ఈడీ అరెస్టు చేసినప్పటికీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే కొనసాగుతారని మంత్రి అతిషీ అన్నారు.

Updated : 21 Mar 2024 23:34 IST

దిల్లీ: దిల్లీ మద్యం విధానం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఆరెస్టు చేసినప్పటికీ.. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన్ను ఎక్కడ ఉంచితే అక్కడినుంచే పాలన కొనసాగిస్తారని దిల్లీ మంత్రి, ఆప్‌ నేత అతిషీ అన్నారు. ఇదే విషయాన్ని తాము ఎప్పట్నుంచో చెబుతున్నామని గుర్తు చేశారు. ఆయన జైలు నుంంచి పనిచేయకుండా నిరోధించే చట్టం లేదని, ఆయనకు శిక్షపడలేదన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టును కుట్రగా పేర్కొన్న అతిషీ.. గత రెండేళ్ల నుంచి దాదాపు 500 మందికి పైగా అధికారులు ఈ కేసులో ఒక్క రూపాయి కూడా రివకరీ చేయలేకపోయారని విమర్శించారు.

సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు.. దిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌

దిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌ ఇంట్లో గురువారం సాయంత్రం సోదాలు జరిపిన ఈడీ అధికారులు ఆయన్ను విచారించిన తర్వాత అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంతో పాటు పలుచోట్ల పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన శ్రేణులు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని