Kejriwal: కేజ్రీవాల్‌కు ఏడోసారి ఈడీ సమన్లు

మద్యం కుంభకోణం వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఏడోసారి సమన్లు ఇచ్చారు.

Updated : 22 Feb 2024 11:37 IST

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఏడోసారి నోటీసులు అందించింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఆరుసార్లు నోటీసులు జారీ చేయగా.. ఒక్కసారి కూడా ఆయన హాజరు కాలేదు.

ఇటీవల ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న తరుణంలో విచారణకు నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని ఆప్‌ ఆరోపించింది. మనీలాండరింగ్‌ కేసులో విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరుపై దర్యాప్తు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల కోర్టు సమన్లు జారీ చేయడంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థాన విచారణకు హాజరయ్యారు.

సత్యపాల్‌ మాలిక్ నివాసంలో సీబీఐ సోదాలు

 విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తదుపరి విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు