Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదులో మొదలైన శాస్త్రీయ సర్వే

కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పురావస్తు శాఖ అధికారులు నేడు సర్వే మొదలుపెట్టారు.

Published : 24 Jul 2023 09:51 IST

వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం చెంతనే ఉన్న జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శాస్త్రీయ సర్వే (scientific survey) ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం రాత్రే వారణాసి చేరుకున్న 30 మంది పురావస్తు శాఖ సభ్యుల బృందం సోమవారం ఉదయం 7 గంటల నుంచి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టింది. వీరితో పాటు హిందూ పిటిషన్ల తరఫు న్యాయవాదులు కూడా ఉన్నారు.

మొగల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధారించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని కీలక తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది.

ఫేస్‌బుక్‌లో ప్రేమ.. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

ఈ సర్వే నివేదికను ఆగస్టు 4వ తేదీ లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే ఈ తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. కోర్టు విచారణ నేపథ్యంలో మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వేను వాయిదా వేయాలని ముస్లిం కమిటీ వారణాసి పోలీసు కమిషనర్‌ను కోరింది. ఇందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో  ఈ సర్వేను వారు బహిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని