Amit Shah: ‘జమాతే ఇస్లామీ’పై నిషేధం పొడిగింపు

‘జమాతే ఇస్లామీ- జమ్మూకశ్మీర్‌’ సంస్థపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

Published : 27 Feb 2024 22:49 IST

దిల్లీ: ‘జమాతే ఇస్లామీ- జమ్మూకశ్మీర్‌ (JIJK)’ సంస్థపై నిషేధాన్ని కేంద్రం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) మంగళవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దేశంలోనే వృద్ధ ఎంపీ షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ కన్నుమూత

జమాతే ఇస్లామీ.. జమ్మూ- కశ్మీర్‌లో అతిపెద్ద రాజకీయ, మతపరమైన సంస్థ. దీనికి పాఠశాలలు, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ ఉండేది. అయితే, ఈ సంస్థ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపణలు ఉన్నాయి. 1990ల్లో కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ అయిన ‘హిజ్బుల్ ముజాహిదీన్‌’కు సైద్ధాంతిక మార్గదర్శిగా దీనికి పేరుంది. ఈ క్రమంలోనే.. 2019 ఫిబ్రవరి 28న కేంద్రం దీన్ని చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించి నిషేధించింది. ఈ సంస్థ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన కేంద్రం.. జమ్మూ-కశ్మీర్‌లోని రూ.వందల కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని