Bhupesh Baghel: డేట్‌, టైం చెప్పండి.. సోఫా ఫొటో షేర్‌ చేసి, అమిత్‌ షాకు బఘేల్‌ కౌంటర్‌

అసెంబ్లీ ఎన్నికల వేళ.. భాజపా, కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) వినూత్నంగా పోస్టు పెట్టారు.

Published : 07 Nov 2023 13:41 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌.. అధికారాన్ని దక్కించుకోవాలని భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) ఒక చిత్రమైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భాజపా అగ్రనేత అమిత్‌ షా(Amit Shah) సవాలును స్వీకరిస్తూ.. డేట్‌, టైం చెప్పడంటూ ట్వీట్ చేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా పాలిత రాష్ట్ర ప్రభుత్వాల రిపోర్టు కార్టులు చూపించాలని కమలం పార్టీని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై అమిత్‌ షా స్పందిస్తూ.. ‘ధైర్యముంటే ఛత్తీస్‌గఢ్‌లో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి సిద్ధమా..?’ అని సవాలు విసిరారు. బఘేల్ ఈ సవాలును స్వీకరించారు. ‘ఐదేళ్లలో మేం చేసిన అభివృద్ధి గురించి, అంతకుముందు రాష్ట్రంలో 15 ఏళ్ల భాజపా పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలపై చర్చ జరగాలి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం’ అని బఘేల్ బదులిచ్చారు. 

బొకే ఇచ్చారు సరే.. మరి పూలు ఎక్కడ..?: ప్రియాంకాగాంధీ వీడియో వైరల్‌

‘అలాగే మీరు సవాలు విసిరిన పండరియా నియోజకవర్గానికే వెళ్లి మీ సవాలును స్వీకరించాను. మీరు ఇంతవరకు వేదిక గురించి, సమయం, తేదీ గురించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రజలు వేదిక సిద్ధం చేశారు. అమిత్‌ షాజీ.. డేట్‌, టైం చెప్పండి’ అంటూ సోఫా చిత్రాన్ని ట్విటర్‌(ఎక్స్‌)లో షేర్ చేశారు. ఆ రెండు సీట్ల సోఫాపై ఒక పక్క అమిత్‌ షా పేరు, మరోపక్క బఘేల్‌ పేరు రాసి ఉంది. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఈ రోజు మొదటిదశ పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 17న రెండో దశ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ మూడున ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని