Munawar Faruqui: హుక్కా బార్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్‌ ఫరూఖీ

బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Updated : 27 Mar 2024 10:50 IST

ముంబయి: స్టాండప్‌ కమెడియన్‌, బిగ్‌బాస్‌ విన్నర్ మునావర్ ఫరూఖీ (Munawar Faruqui) మరోసారి వివాదాల్లో నిలిచాడు. ముంబయిలోని హుక్కా బార్‌లో జరిగిన సోదాల అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘బటర్‌ చికెన్‌’ వివాదంలో పరువు నష్టం వ్యాఖ్యలు

నగరంలోని ఫోర్ట్ ఏరియాలో చట్టవిరుద్ధంగా నడుపుతోన్న హుక్కా పార్లర్‌లో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సోదాలు జరిగాయి. కొంత మొత్తంలో నగదు, కొన్ని హుక్కా పాట్స్‌ను సీజ్‌ చేశారు. ‘దాడుల్లో భాగంగా ఫరూఖీ, మరికొందరు హుక్కా పీలుస్తున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. దానికి సంబంధించిన దృశ్యాలు మా వద్ద ఉన్నాయి. మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నాం’ అని అధికారులు తెలిపారు. వారిపై మోపిన సెక్షన్లు బెయిల్‌ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండటంతో, వారికి నోటీసులు ఇచ్చి, విడుదల చేశామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ అతడి షోపై ఫిర్యాదులు అందడంతో 2021లో నెలరోజుల పాటు మునావర్ జైలు జీవితం గడిపాడు. 2022లో ‘లాకప్‌’ రియాలిటీ టీవీ షో విజేతగా నిలిచాడు. తర్వాత బిగ్‌బాస్‌-17 షోలో కూడా విజయం సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని