BJP Campaign: దిల్లీలో మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లను నమ్ముకొన్న భాజపా

దేశ రాజధాని దిల్లీలో ప్రచారానికి భాజపా సరికొత్త వ్యూహం చేపట్టింది. సోషల్‌ మీడియా మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లను నమ్ముకొంది. 

Published : 25 Mar 2024 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని ఎన్నికల ప్రచారం చేయడంలో భాజపా (BJP) చాలా ముందుంటుంది. ఈసారి ఆ పార్టీ దిల్లీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఓ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. పార్టీలోని మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకొంది. వీరికి క్షేత్రస్థాయిలో ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉంటాయని పార్టీ బలంగా నమ్ముతోంది. భారీ ఫాలోయింగ్‌ ఉన్నవారితో పోలిస్తే.. చిన్న ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటను సమాజంలో ఎక్కువ నమ్ముతారని భావిస్తోంది. వీరి ఫాలోవర్ల సంఖ్య కూడా కేవలం 2,000 నుంచి 5,000 మధ్యలోనే ఉంటుందని దిల్లీ భాజపా సోషల్‌ మీడియా ఇన్‌-ఛార్జి రోహిత్‌ ఉపాధ్యాయ తెలిపారు. 

దిల్లీలో పార్టీ సరికొత్త ప్రచారం చేపట్టింది. ‘‘దిల్‌ మే మోదీ.. దిల్లీ మే మోదీ’’ పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఓటర్లకు భాజపా హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను వివరిస్తున్నారు. అవి ప్రజలను ఏవిధంగా ప్రభావితం చేశాయో కూడా తెలియజేస్తున్నారు. ‘‘పార్టీ ఏదైనా మంచి చేస్తే చాలామంది ఇన్‌ఫ్లూయెన్సర్లు సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా దానిని ప్రచారం చేశారని.. తాము వారిని సంప్రదించడం వంటివి చేయలేదు’’ అని ఉపాధ్యాయ వెల్లడించారు. ఈసారి మాత్రం పార్టీలో పనిచేసే వారిపై పూర్తి బాధ్యతలు పెట్టాలని నిర్ణయించాము. పెద్ద సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో పోలిస్తే వీరి ఫాలోవర్ల సంఖ్య తక్కువేనని వెల్లడించారు. 

నాడు హిమాచల్‌ను వద్దనుకున్న కంగన.. పాత ట్వీట్‌ వైరల్‌

సమాజంలోని అన్ని వర్గాలను చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు భాజపా సోషల్‌ మీడియా విభాగం చెబుతోంది. ఈక్రమంలో ఏ వర్గం ఎటువంటి సామాజిక మాధ్యమాలను వాడుతున్నారో తెలుసుకొని వారిని చేరుకొంటున్నామన్నారు. వయసులో పెద్దవారు, వెనకబడినవారు ఫేస్‌బుక్‌, యువత ఇన్‌స్టాగ్రామ్‌, విద్యావంతులు ఎక్స్‌ మాధ్యమం అధికంగా వాడతారు. ఇలాంటి విషయాలను దృష్టిలోపెట్టుకొని ఆయా మాధ్యమాలకు తగిన కంటెంట్‌ను వారికి అందిస్తామన్నారు. ఇప్పటికే పార్టీ దిల్లీలోని ఏడు లోక్‌ సభ స్థానాల్లో ఆరుచోట్ల కొత్త అభ్యర్థులను ఎంచుకొంది. ఈశాన్య దిల్లీలో మనోజ్‌ తివారీని మాత్రమే కొనసాగిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని