Rahul Gandhi: రాహుల్ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్’ వ్యాఖ్యలు.. ఈసీకి భాజపా ఫిర్యాదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

Published : 01 Apr 2024 18:25 IST

దిల్లీ: ఎటువంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా భాజపా 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈవిషయంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా(BJP) ఎన్నికల సంఘాన్ని(EC) ఆశ్రయించింది. అనంతరం కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి నేతృత్వంలోని బృందం మీడియాతో మాట్లాడింది.

‘‘నిన్న జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికలు మ్యాచ్‌ ఫిక్సింగ్ అన్నారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషుల్ని మోహరించిందన్నారు. అలాగే ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారని మాట్లాడారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం’’ అని మంత్రి వెల్లడించారు.

ఎన్నికలముందు ‘కచ్చతీవు’ రగడ.. జై శంకర్ ఏమన్నారంటే..?

దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ లోక్‌తంత్ర బచావో ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ఐపీఎల్‌ మ్యాచ్లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి ఆటగాళ్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవవచ్చు. దీనిని క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. మన ఎదుట లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ప్రధాని మోదీ ఎన్నుకొన్నారు. మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా వారు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం’’ అని భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు