Arvind Kejriwal: కస్టడీలో కేజ్రీవాల్ భద్రత సంగతేంటి..? ఆప్‌ ఆందోళన

Arvind Kejriwal: ఎన్నికల ముందు విపక్ష నేతలపై భాజపా దాడులు ప్రారంభించిందని ఆప్‌ (AAP) మంత్రి ఆతిశీ ఆరోపించారు. 

Published : 22 Mar 2024 10:46 IST

దిల్లీ: తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని.. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా..?అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆప్‌ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడారు.

‘‘ఎన్నికలకు ముందు విపక్ష నేతలపై దాడులు మొదలయ్యాయి. కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు, ఆప్‌ను అణచివేసేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. ఆ యత్నాలకు దిల్లీ వాసులే కాకుండా దేశ ప్రజలు సరైన సమాధానం చెప్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆతిశీ అన్నారు.

రాత్రంతా ఈడీ లాకప్‌లో కేజ్రీవాల్‌.. కాసేపట్లో కోర్టుకు

మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్‌ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు