Mamata Banerjee: మమతపై భాజపా నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడిన టీఎంసీ

తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ (Mamata Banerjee)ని ఉద్దేశించి భాజపా సీనియర్ నేత ఒకరు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

Published : 26 Mar 2024 18:17 IST

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ భాజపానేత దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు చేసినట్లు ఒక వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. దాంతో అది తీవ్ర దుమారం రేపుతోంది. ఘోష్‌ తీరును ఖండించిన తృణమూల్ కాంగ్రెస్‌ (TMC).. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

కంగనపై పోస్టు వివాదం.. కాంగ్రెస్‌ నేతపై జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు

బెంగాల్‌కు స్థానిక వ్యక్తే కావాలంటూ టీఎంసీ ఇచ్చిన నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘గోవాకు వెళ్లినప్పుడు నేను గోవా బిడ్డను అని చెప్తారు. త్రిపురలో ఉన్నప్పుడు త్రిపుర పుత్రికను అంటారు. మొదట దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాలి..’ అంటూ దిలీప్‌ ఘోష్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. దీనిపై తృణమూల్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బెంగాల్‌ శిశుసంక్షేమశాఖ మంత్రి శశిపంజా డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోంది. బెంగాల్ మహిళలపై ఘోష్‌కు గౌరవం లేదు’ అని ఆ పార్టీ మండిపడింది. అలాగే ఆయన మాట్లాడిన వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. దిలీప్ ఘోష్.. భాజపా బెంగాల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. ఆయన మేదినీపుర్ సిట్టింగ్ ఎంపీ. ఈసారి బర్దమాన్-దుర్గాపుర్ నియోజకవర్గం నుంచి పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని