Bengaluru: బెంగళూరుపై అతి తక్కువ ఎత్తులో వీవీఐపీ భారీ విమానం..!

ప్రధాని, రాష్ట్రపతిలు వినియోగించే ఓ వీవీఐపీ విమానం తరచూ బెంగళూరు పై అతి తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతోంది. 

Updated : 04 Apr 2024 13:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండ్రోజుల నుంచి బెంగళూరు (Bengaluru) నగరంలోని కొరమంగళ ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో ఓ బోయింగ్‌ విమానం తరచూ ప్రయాణించడం స్థానికులను గందరగోళానికి గురి చేస్తోంది. అక్కడే ఉన్న హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఎయిర్‌పోర్టపై అది ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లిపోతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను స్థానికులు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 

ఫ్లైట్‌రాడార్‌24 వెబ్‌సైట్‌ ప్రకారం అది K7067 నంబరున్న బోయింగ్‌ 777-337 విమానం. దానిని ప్రధాని, రాష్ట్రపతి వంటి వీవీఐపీలకు వినియోగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఇలాంటివి రెండు ఉన్నాయి. అది దిల్లీ నుంచి బెంగళూరు వచ్చి హల్‌ ఎయిర్‌పోర్టుపై ఆరు చుట్లు తిరిగినట్లు తేలింది. అది ఎక్కడా ల్యాండ్‌ అవ్వకుండానే తిరిగి దిల్లీ వెళ్లిపోయింది. ఇందిరానగర్‌పై కూడా ఇది చక్కర్లు కొట్టింది. ‘చాలా కిందికి వచ్చింది.. కానీ, ల్యాండ్‌ కాకుండానే వెళ్లిపోయింది’ అని ఒక ఎక్స్ యూజర్‌ పేర్కొన్నాడు. ‘ఈ విమానం రోజూ వస్తోంది. అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది’ అని మరో యూజర్‌ పేర్కొన్నాడు. 

కేజ్రీవాల్‌ అంశంలో మాకు పక్షపాతం లేదు: వివరణ ఇచ్చిన అమెరికా

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈ వీవీఐపీ విమానాన్ని పెద్దగా వాడే అవసరం రాదు. దీంతో దానిని కండీషన్‌లో ఉంచేందుకు, పైలట్లకు శిక్షణ కోసం వినియోగిస్తున్నట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని